-ప్రతి ఇంటిలో ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ గా చేసేందుకు ఎంపి కేశినేని కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్త అమ్మవారి గుడి వద్ద నగరాల సామాజిక వర్గ సంఘాలకు, గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విశ్వ బ్రాహ్మణులకు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ అందుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారైందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్ఢినేటర్ మాదిగాని గురునాథం మాట్లాడుతూ స్వర్ణ కారులు,చేతి వృత్తులకు విశ్వకర్మ పథకం చాలా ఉపయోగంగా వుంటుందని, ఒక క్లస్టర్ గా ఏర్పడితే ఈ పథకంలో 90 శాతం సబ్సిడీ , వ్యక్తిగతంగా రుణాలు తీసుకుంటే 45 శాతం సబ్బిడీ లభిస్తుందని తెలిపారు. పి.ఎమ్. అస్మిత పథకంలో స్వయం సహాయక మహిళ సంఘాలకు కోటీ రూపాయల వరకు రుణం అందిస్తారని, ఈ రుణం కోసం ఎటువంటి ష్యూరిటీ అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి గ్యారెంటీ ఎంటర్ ప్రెన్యూర్ ప్రోగ్రామ్ కింద రూ.లక్ష నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఎలాంటి కొలెట్రాల్ లేకుండా ఇస్తారని, కొలెట్రాల్ తో రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తారని ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటిలో ఒకర్ని ఎంటర్ ప్రెన్యూర్ గా చేసేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చేస్తున్న కృషి ని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్ఢినేటర్ మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ, టిడిపి సీనియర్ నాయకులు నరసింహాచౌదరి, నగరాల సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మరిపిల్ల తిరుమల్లేష్, నగరాల యూత్ నాయకుడు మణికంఠ లోకేష్, సాయి సుధాకర్, టిడిపి నాయకులు పట్నాల హరిబాబు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News