Breaking News

18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సర్వం సిద్ధం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బహుమతులు , క్రీడా సామాగ్రిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ అనూరాధ, మంత్రులు, ఎమ్మెల్యేలతో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు.

18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విజేతలకు ప్రైజులు, మెమెంటోలు అందజేయడం, క్రీడల్లో పాల్గొనే వారికి గాను ప్రత్యేక డ్రెస్సు శాప్ చైర్మన్ రవి నాయుడుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మార్చి 20న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విప్ గణబాబు గారు,శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు,సుందరపు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *