Breaking News

బాధితులకు ఎల్ వో సి చెక్ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో ప్రైజర్ పేటకు చెందిన పాటిబండ్ల ప్రకాష్ కు మంజూరైన రూ 2 లక్షల 20 వేల విలువ గల ఎల్ వో సి చెక్కును బాధితుడి కుటుంబానికి అందించినట్టు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. పాటిబండ్ల ప్రకాష్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానిక టిడిపి నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి ఎల్ వో సి చెక్కును జారీ చేయడంతో కార్యాలయ కార్యదర్శి చెక్కును అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *