Breaking News

2030 నాటికి మూడు వేల ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్ ఎగుమ‌తే ల‌క్ష్యం

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొద‌టిగా విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసింది టీడీపీనే
-రిల‌య‌న్స్ బ‌యో గ్యాస్ ప్లాంట్ల‌తో రైతుల‌కు ల‌బ్ధి
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను మొద‌టిసారి అమ‌లు చేసింది తెలుగుదేశం పార్టీనే అని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఏపీ అసెంబ్లీలో పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ‌పై జ‌రిగిన లఘు చ‌ర్చలో భాగంగా గురువారం ఆయ‌న‌ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గౌర‌వ స‌భ్యుల‌కు వివ‌రించారు. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను ప్రారంభమయ్యాయని వెల్ల‌డించారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఈఆర్సీ ని తీసుకువ‌చ్చింది కూడా ఏపీనే అని ఈ సంద‌ర్భంగా తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పున‌రుత్పాద‌క విద్యుత్ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో తో అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హాబ్ ప్రాజెక్టును ఎన్టీపీసీ, నెడ్ క్యాప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న పేర్కొన్నారు. 2030 సంవ‌త్స‌రం నాటికి మూడు వేల ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్పత్తి, ఎగుమ‌తి ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. రిల‌య‌న్స్ సంస్థ రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బ‌యో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణంతో రాష్ట్రంలోని రైతుల‌కు మ‌రింత ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. టాటా రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ తో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మంత్రి ఈ మేరకు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రూ. 49 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. అదే విధంగా బ్యాట‌రీ స్టోరేజ్ సిస్టంను రాష్ట్రంలో తొలిసారి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. వినియోగదారులకు నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం 55 స‌బ్ స్టేష‌న్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నట్లు మంత్రి సభలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏటా 6శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని, ఆ వినియోగానికి స‌మానమైన విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీల‌ను ఒక్క రూపాయి కూడా పెంచ‌లేద‌న్నారు. ఏపీ జెన్కో ద్వారా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని చెప్పారు. త‌ద్వారా విద్యుత్ కొనుగోళ్ల‌ను కూడా 60 శాతానికి త‌గ్గించామ‌ని పేర్కొన్నారు. పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం వ‌ద్ద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే… సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా మ‌రిన్ని క‌నెక్ష‌న్లు కావాల‌ని ప్ర‌ధాన మంత్రికి లేఖ రాసిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుది అన్నారు. అదే విధంగా పీఎం కుసుమ్ ప‌థ‌కం ద్వారా రైతుల‌కు నాణ్య‌మైన విద్యుత్ ను అందిస్తున్నామ‌న్నారు. మొత్తం 4.5 ల‌క్ష‌ల పీఎం కుసుమ్ వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు మంత్రి గొట్టిపాటి వివ‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వంలో 9 సార్లు క‌రెంట్ ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై మోయ‌లేని భారాలు మోపార‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వం… లిఫ్ట్ ఇరిగేష‌న్ ద్వారా ఒక్క ఎక‌రాకూ.. చుక్క నీరు కూడా ఇవ్వ‌లేద‌న్నారు. అదే విధంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌త‌నాలపై జిల్లా ఎస్పీల‌తో చ‌ర్చించి ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేయిస్తామ‌ని హామీ ఇచ్చారు. విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ నాశనం చేసిన జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుత్ శాఖ‌కు సంబంధించి గౌర‌వ స‌భ్యులు స‌భ దృష్టికి తీసుకొచ్చిన అంశాల‌ను ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *