Breaking News

హస్తకళాకారులకు మార్కెట్‌ సౌకర్యానికి స్టాల్‌ ఇన్‌ మాల్‌..

-స్టాల్‌ ఇన్‌ మాల్‌ ద్వారా నిరుద్యోగులకు ఆర్ధిక ప్రయోజనం..
-నాబార్డ్‌ జియం డా. కెవిఎస్‌ ప్రసాద్‌

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణహస్తకళాకారులచే తయారు చేయబడిన ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశలు మెరుగు పరచాలనే లక్ష్యంతో స్టాల్‌ ఇన్‌ మాల్స్‌ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ డా. కెవిఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

నాబార్డ్‌ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పివిపి మాల్‌లో నిర్వహించిన స్టాల్‌ ఇన్‌ మాల్‌ ప్రదర్శన అమ్మకాల ముగింపు కార్యక్రమానికి నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ డా. కెవిఎస్‌ ప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరై స్టాల్స్‌ ద్వారా అమ్మకాలు నిర్వహించిన హస్తకళాకారులకు ప్రసంశా పత్రాలు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్బంగా నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ నాబార్డ్‌ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, యువతకు హస్తకళా ఉత్పత్తులపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. హస్తకళాకారులు అత్యంత కళా నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలానే లక్ష్యంతో స్టాల్‌ ఇన్‌ మాల్స్‌ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రదర్శనలు అమ్మకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. గత మూడు మాసాలుగా పివిపి మాల్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన ద్వారా రూ. 49 లక్షల పైగా అమ్మకాలు నిర్వహించడం జరిగిందన్నారు. వినియోగదారుల అభిరుచుల మేరకు చేనేత వస్త్రాలు, జ్యూట్‌ బ్యాగులు, కలంకారి వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండల వంటివి ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల నుండి స్వయం సహాయక బృందాల మహిళలకు నిరుద్యోగ యువత ప్రదర్శనలో పాల్గొనడం జరిగిందన్నారు. వీరికి ఉచిత రవాణ, వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

నేస్తం సంస్థ సీఈవో వి. సురేష్‌ మాట్లాడుతూ నాబార్డ్‌ సహకారంతో గత ఏడాది విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలో స్టాల్‌ ఇన్‌ మాల్స్‌ ప్రదర్శనను నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కో ప్రదర్శన 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఒక్కొక్క కళాకారుడు, చేతివృత్తిదారులకు 15 రోజులపాటు ప్రదర్శన అమ్మకాలు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించామన్నారు. గ్రామీణ హస్తకళారూపాలను తయారీ చేసిన ఉత్పత్తులు తయారీ ధరలకే వినియోగదారులకు అందించడంతో ఆశించిన దానికంటే ఆర్థికంగా అమ్మకాలు నిర్వహించి కళాకారులకు మరింత ఆర్ధిక ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు.

స్టాల్‌ ఇన్‌ మాల్‌ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో నాబార్డ్‌ ఎజియం మిలింద్‌ చౌసాల్కర్‌, నేస్తం సంస్థ డైరెక్టర్‌ కె. నందిని, పివిపి పాల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాచేటి అనిల్‌ కుమార్‌, నేస్తం సంస్థ ప్రతినిధులు వై. గోపి, డి.వినయ్‌, యం శ్రీనివాస్‌, యం. సూర్యబాబు, స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *