Breaking News

మహిళలకు రక్షణ పోష్ చట్టం గురించి అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పనిచేసే ప్రదేశలలో లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ పోష్ (POSH) చట్టం గురించి వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో అవగాహన సదస్సును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ నిర్వహించారు.
ఈ సంధర్భం గా పోలీసు కమిషనర్మాట్లాడుతూ… పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు అనేది చిన్న విషయం కాదు దీన్ని ఈజీగా తీసుకోకూడదు. ఈ విషయంలో మహిళలు మౌనంగా ఉండకుండా నిర్భయంగా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని దానికోసం పోషె (POSH) చట్టం ఉన్నదని దీనివలన కార్యాలయాల్లో మరియు పని ప్రదేశాల్లో మహిళలు సురక్షితంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీని గురించి మహిళా ఉద్యోగులు,అధికారులు అందరూ అవగాహన కలిగి ఉండాలని వారికి ఇటువంటి పరిస్థితులు లేదా సంఘటనలు ఎదురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించినట్లయితే ఈ చట్ట ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు . దీని ప్రకారం గరిష్టంగా 90 రోజులు లోపల కార్యాలయం లేదా పోలీస్ స్టేషన్లలో అంతర్గత కమిటీలో(ఐ‌సి‌సి-ఇంటెరనల్ కంప్లీయంట్ సెల్) ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు శారీరకంగా అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేయడం అనుచితంగా తాకడం అశ్లీల సైగలు చేయడం మొదలైనవి.. ఈ చట్టం క్రింద వస్తాయి. అంతేకాకుండా లైంగిక వ్యాఖ్యలు చేయడం అశ్లీల కంటెంట్ పంపించడం కూడా ఈ చట్ట ప్రకారం నేరమే మహిళలకు ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఎదురైనా ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చుఅని అన్నారు.
వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి మహిళా సిబ్బందికి అధికారులకు ఈ చట్టం గురించి లోతైన అవగాహన కల్పించి ఈ చట్ట ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ ఏర్పాటుగురుంచి,లోకల్ కంప్లైంట్ సెల్ గురుంచి ఈ చట్టం లోని పలు సెక్షన్లు గురుంచి, అవగాహన కల్పించి సిబ్బంది ,అధికారులు సందేహాల నివృత్తి చేసినారు.
అనంతరం డీ.సి.పి. ఏ,బీ,టీ,ఎస్ ఉదయ రాణి ఐ.పి.ఎస్, ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారుకులైన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కి మరియు వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి కి వోట్ ఆఫ్ థాంక్స్ తెలిపినారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తో పాటుగా వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి డిసిపిలు జి.వి. సరిత ఐ.పి.ఎస్, ఉదయ్ రాణి ఐ.పి.ఎస్, చక్రవర్తి మరియు ఎ.డి.సి.పి జి రామకృష్ణ సి.పి.ఓ అధికారులు, సిబ్బంది మహిళా పోలీస్ అధికారులు, మహిళా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *