Breaking News

సెల్ పోన్, టివి రిపేరింగ్ కు శిక్ష‌ణ ఇచ్చే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేయాలి

-పోలిశెట్టి పాడు గ్రామ యువ‌త‌ పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కి విజ్ఞ‌ప్తి

ఏ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు పొలిశెట్టిపాడు గ్రామంలో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కావాల‌ని ఆ గ్రామ యువ‌కులు, మ‌హిళ‌లు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ను కోరారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయ‌తీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో విక‌సిత్ పంచాయ‌తీలో భాగంగా స‌మ‌గ్ర గ్రామాభివృద్దికి శిక్షణ పొందిన పంచాయ‌తీ ఛాంపియన్స్ ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో గురువారం తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామ ప్ర‌జ‌లు,, డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య అధ్య‌క్ష‌త వ‌హించిన ఈ స‌మావేశంలో గ్రామ ప్ర‌జ‌ల‌తో వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పంచాయ‌తీ చాంపియ‌న్స్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా యువ‌కులు టివి, సెల్ పోన్ రిపేరింగ్ లో శిక్ష‌ణ , మ‌హిళ‌లు కుట్టుమిష‌న్, అల్లిక‌లు నేర్పించే శిక్ష‌ణ ఇప్పించే విధంగా స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కావాల‌ని కోరారు. అదే విధంగా గ్రామంలోని పంచాయ‌తీ కార్యాల‌యం శిధిలాస్థ‌లో వుంద‌ని, దాన్ని ఆధునీక‌రించాల్సిన అవ‌స‌రం వుంద‌ని ప్ర‌జ‌లు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ దృష్టికి తీసుకువచ్చారు.ఇక గ్రామంలో రోడ్లు, సైడ్ డ్రైన్స్ లేక ప‌డుతున్న ఇబ్బందుల‌ను కూడా తెలియ‌ప‌ర్చారు.

అలాగే కొంత‌మంది నాటు కోళ్ల పెంప‌కం, సొలార్ డ్రైయ‌ర్స్ యూనిట్స్ పై ఆస‌క్తి చూపించ‌టంతో ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ద్వారా ఏ విధంగా ఆ యూనిట్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు అనే అంశం పై పంచాయ‌తీ చాంపియ‌న్స్ అవ‌గాహ‌న క‌ల్పించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఈ రుణాల‌ను ప్ర‌జ‌ల‌కు ఇప్పించేందుకు చేస్తున్న స‌హాయ స‌హ‌కారాలు తెలియ‌చేశారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదిగేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్ర‌జ‌లు తెలిపిన స‌మ‌స్య‌ల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ నోడ‌ల్ అధికారి కె.శ్రీనివాస‌రావు దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ పార్టీ సర్పంచి బొల్లి శెట్టి చిట్టిబాబు , మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి , గ్రామ పార్టీ అధ్యక్షుడు గోగులమూడి రామ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా టిడిపి నాయ‌కులు తుమ్మూరి శ్రీనివాసరెడ్డి , జిల్లా తెలుగు రైతు సంఘం నాయ‌కులు పిన్నమనేని శ్రీనివాసరావు(అబ్బు), మండ‌ల‌ బీసీ నాయకులు గణేష్ లతో పాటు గ్రామ ప్ర‌జ‌లు, పంచాయ‌తీ ఛాంపియన్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *