Breaking News

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ లోని తారాపేట లోని వారి నివాసంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) న్యాయశాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్, ముస్లిం సోదరులు కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి , ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందని అన్నారు.ఈ మాసంలో ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొనడం హర్షణీయమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఐకమత్యంతో మెలగాలని అల్లాను వేడుకున్నారు. విశ్వ మానవాళి శాంతికి రంజాన్ ప్రతీక అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు అబ్దుల్ వాహబ్, సలీం, అబ్దుల్ ఖాదర్, అర్షద్, హనీఫ్, రౌఫ్, రషీద్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్, గొట్టిపాటి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *