Breaking News

ఘనంగా నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నడిబొడ్డున శోభన్ బాబు సర్కిల్. నందు గురువారం శోభన్ బాబు విగ్రహానికి రాష్ట్ర శోభన్ సిండికేట్ అధ్యక్షులు డాక్టర్ కళ్లెపల్లి. మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ధారా. సత్యన్నారాయణ ఆధ్వర్యంలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు అభిమానులు మధ్యలో పూలదండలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర శోభన్ సిండికేట్ అధ్యక్షుడు డాక్టర్ కళ్ళే పల్లి మధుసూదన రాజు మాట్లాడుతూ శోభన్ బాబు మరణించి 17 సంవత్సరాల గడిచిన నేటికీ ఆయన తీపి గుర్తులు ఆయన మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ ఆయన చూపిన బాటలో పయనిస్తున్నామని, ఇది శోభన్ బాబు అభిమానులందరికీ గర్వకారణమని,, నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ప్రధాన కార్యదర్శి డాక్టర్. ధారా. సత్యనారాయణ మాట్లాడుతూ శోభన్ బాబు అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన జీవిత విశేషాలు గురించి వివరించారు తధానంతరం పలువురు వక్తలు మాట్లాడారు అనంతరం పళ్ళు,, అల్పాహారం,, భోజనం ప్యాకెట్లు పంచడం, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారు రేమాల రామకృష్ణ ,,కన్వీనర్ బి ఆంజనేయులు,వైస్ ప్రెసిడెంట్ కే.జగన్మోహన్, సహాయ కార్యదర్శి వెంకట్, సలహాదారులు కె.వి సుబ్బరాజు & ప్రబల శ్రీనివాస్, సింగర్ ప్రభుదాస్,, పి శ్రీనివాస్,,రామకృష్ణ మరియు పెద్ద ఎత్తున శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *