Breaking News

ఈ నెల 22న సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన శంకుస్థాపన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు జరుగును. సత్తెనపల్లి పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన శనివారం (22.03.2025) మధ్యాహ్నం 12:00 గంటలకు కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ చేయుదురు అని తదుపరి వేంకటేశ్వర గ్రాండ్, అయ్యప్పస్వామి గుడి దగ్గర, ఆర్.టి.సి. బస్టాండ్ సమీపం, సత్తెనపల్లి నందు సమావేశం జరుగుతుంది అని నరసరావుపేట పోస్టల్ సూపరింటెండెంట్ పి వి వెంకట స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజ్య సభ పార్లమెంట్ సభ్యులు. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు  విచ్చేయుచున్నారు. విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు,  మర్రి రాజశేఖర్, కన్నా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు (సత్తెనపల్లి నియోజకవర్గం), చల్లంచర్ల లక్ష్మీతులసి, చైర్ పర్సన్, సత్తెనపల్లి పురపాలక సంఘం, లోకా కళ్యాణి, స్థానిక 12 వార్డు కౌన్సిలర్ విచ్చేయుచున్నారు. మరియు ముఖ్య అతిథులు తపాల శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, కే. ప్రకాష్, పోస్ట్ మాస్టర్ జనరల్, DSVR మూర్తి, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, కే. సంతోష్ నేతా, పల్నాడు జిల్లా కలెక్టర్ P అరుణ్ బాబు, సత్తెనపల్లి మున్సిపల్ కమీషనర్ నంబూర్ ఆనంద కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోవుచున్నది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *