Breaking News

మన రాష్ట్రం నుండి 1630 మంది హజ్ యాత్రికులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025 సంవత్సరం లో హజ్ యాత్ర చేయుటకు మన రాష్ట్రం నుండి 1630 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో, యాత్రికులు, తమ వ్యక్తిగత కోరికపై వివిధ విమానాశ్రాయాల ద్వారా ప్రయాణం చేయుటకు ఆన్ లైన్ లో తమ దరఖాస్తు నమోదు చేయుటకు రెండు అప్షన్ లు ఇవ్వడమైనది. అప్షన్ ల వారీగా, వివిధ ఎంబార్ కేషన్ పాయింట్ల నుండి బయలుదేరు యాత్రికుల వివరాలు క్రింది విధంగా వున్నవి.

1. హైదరాబాదు ఎంబార్కేషన్ పాయింట్ – 1096 మంది
2. బెంగళూరు ఎంబార్కేషన్ పాయింట్ – 454 మంది
3. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ – 71 మంది
4. ఇతర ఎంబార్కేషన్ పాయింట్ల నుండి – 09 మంది

అయితే, పై తెలిపిన 71 మంది హజ్ యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు బదులుగా హైదరాబాదును రెండవ ప్రాధాన్యతగా ఇది వరకే ఎన్నికొని వున్నారు. విమానయాన శాఖా ద్వారా కేవలం హజ్ యాత్రికుల కొరకు మాత్రమే ప్రత్యేక విమనాలు కేటాయించడం జరుగుతుంది. కానీ, సంఖ్యాపరంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి కేవలం 71 మందికి మాత్రమే ప్రత్యేక చాప్టర్ విమానం అందుబాటులోకి తీసుకురావడం సాంకేతింగా కుదరలేదు. కావున, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, వారు 71 మంది యాత్రికుల రెండవ ప్రాధాన్యతను అంగీకరించి, వారికి హైదరాబాదు ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రను కొనసాగించేలా అనుమతించింది. ఎక్కువ సంఖ్యలో హజ్ యాత్రికులు తమ అప్షన్ ని విజయవాడ ఎంబార్ కేషన్ పాయింట్ గా కోరుకుంటే, విజయవాడ నుండి హజ్ యాత్రకు బయలుదేరుటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం 1630 మంది అంధ్రప్రదేశ్‌కు చెందిన హజ్ యాత్రికుల కోసం హైదరాబాదు మరియు బెంగళూరు నగరాల్లో ప్రత్యేక హజ్ శిబిరాలను ఏర్పాటు చేయడానికి, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇది వరకే శాఖాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *