అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ అభివృద్దికి సంబంధించి నాలుగు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామన్నారు మంత్రి నారాయణ…రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో స్వార్ధం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని..మళ్లీ మార్పులు చేసి ప్రజాభిప్రాయంతో ఫైనల్ ప్లాన్ విడుదల చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్దితో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమీక్ష చేసారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, కొణతాల రామకృష్ణ,పంచకర్ల రమేష్,వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు,APUFIDC చైర్మన్ పీలా గోవింద్, VMRDA చైర్మన్ ప్రణవ గోపాల్, రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్,VMRDA కమిషనర్ విశ్వనాథ్,ఇతర అధికారులు హాజరయ్యారు. వైజాగ్ లో రోడ్ల విస్తరణ,ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైల్ ప్రాజెక్ట్, భూముల ఆక్రమణ, తాగునీటి సమస్య, టీడీఆర్ బాండ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వంటి అంశాలను సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
నారాయణ,మంత్రి….
గతంలో స్వార్ధం కోసం విశాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించారు..తిరిగి మళ్లీ మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ ఆన్లైన్ లో ఉంచుతాం.ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లో ఫైనల్ చేస్తాం.మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని చేయాలి..కొన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయాల్సి ఉంది. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్ లో భాగమే…దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు ఉన్నాయి.టీడీఆర్ బాండ్లపైనా సమావేశంలో చర్చించాం. టీడీఆర్ బాండ్ల పై అన్ని మున్సిపాలిటీ లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. అన్నీ త్వరలో నే పరిష్కారం అవుతాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. దీంతో రోడ్ల విస్తరణ చెయ్యాల్సి ఉందితాగు నీటిసమస్య కూడా ఉంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. విశాఖ అభివృద్ది కొరకు సీఎం గారి ఆదేశాలతో ముందుకెళ్తున్నాం.
కొణతాల రామకృష్ణ.ఎమ్మెల్యే.
వైజాగ్ అభివృద్ధి పై జరిగిన సమీక్ష లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించే ఆలోచన చేసాం. నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ పక్కగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం.22ఏ భూములు.. తాగు నీటి సమస్యలు..బీచ్ కారిడార్ సమస్యలు ఉన్నాయి.చాలా కాలంగా అనకాపల్లి.. గాజువాకలో భూ సమస్యలు ఉన్నాయి…సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అంగీకారం తెలిపారు.
పల్లా శ్రీనివాసరావు,ఎమ్మెల్యే..
మాస్టర్ ప్లాన్ పై సమీక్ష చేసాం. కొన్ని రోడ్లకు పక్కన చిన్న చిన్న స్థలాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడమని మంత్రి నారాయణ ను కోరాము.అధికారులు మారడం వల్ల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.
విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే.
విజన్ 2047 పై ఫోకస్ పెట్టినట్టుగానే సీఎం చంద్రబాబు వైజాగ్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖా చాలా కీలకం..వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయాలని కోరాము.
Prajavartha Online Telugu News