మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో
స్థానిక ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో షాహెదీ దివాస్ మార్చి 23 2 1930 బ్రిటిష్ వారి చేతిలో పూరి గావించిన భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ నందు 15 మంది యువతతో రక్తదానం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులందరికీ ఈ సాహేదీ దివాస్ సందర్భంగా రాజ్ గురు ,భగత్ సింగ్ ,సుఖదేవ్ , వంటి స్వాతంత్ర సమరయోధులు ఎటువంటి త్యాగాలను చేశారో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏంజెల్ జేవియర్ గారు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి నాని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఐక్యం ఫౌండేషన్ శ్వేత ఆకూరి మరియు యువత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News