Breaking News

విశాఖలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం క‌ల్పించిన ఎసిఎ

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో వీక్షించే అవ‌కాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ (ఎసిఎ) 30మంది అనాథ చిన్నారుల‌కు క‌ల్పించింది. వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శ‌రణాల‌యానికి 30 టికెట్లు త‌న సొంత నిధుల‌తో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అంద‌జేసింది. మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారుల‌కు ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ చిన్నారుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా కావాల్సిన స‌దుపాయాలు ద‌గ్గ‌రుండి చూశారు. కాసేపు వారితో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పారు. త‌మ‌కు మ్యాచ్ చూసే అవ‌కాశం క‌ల్పించిన ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆ చిన్నారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *