గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ ల టెండర్ మరియు బహిరంగ వేలం ఈ నెల 27న జిఎంసి ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహిస్తామని, ఆసక్తి కల్గినవారు పాల్గొనవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ లకు టెండర్ మరియు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న లీజుదారులు కూడా బకాయిలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కల్గిన వారు రూ.100 చలానా చెల్లించి, జిఎంసి ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ఏ-2 గుమస్తా వద్ద నుండి టెండర్ షెడ్యుల్ పొందవచ్చన్నారు. వివరాలకు డిప్యూటీ కమిషనర్ (9849908364) వారిని సంప్రదించవచ్చన్నారు.
Prajavartha Online Telugu News