Breaking News

జిల్లా స్థాయి భూ కేటాయింపుల సమీక్షా కమిటీ పునర్‌ నిర్మాణం

-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి భూ కేటాయింపు సమీక్షా కమిటీను పునర్‌ నిర్మాణం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నంబర్లు 1 నుండి 7) రద్దు చేసారు. సి సి ఎల్ ఏ చేసిన ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

పునర్‌రచించిన కమిటీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షత వహించనుండగా, సంబంధిత జిల్లా మంత్రి, జాయింట్ కలెక్టర్ (సభ్య కార్యదర్శి), నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆర్‌డిఓ/సబ్ కలెక్టర్ సభ్యులుగా నియమితులయ్యారు. అదనంగా, అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక ఆహ్వానితులను కూడా కమిటీకి పిలిచే అవకాశం ఉంది. కమిటీ ప్రధానంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు మరియు మిగులు భూపరిమితి భూములను అర్హులైన భూహీన పేదలకు వ్యవసాయ ప్రయోజనాల కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకోనుంది. అలాగే, భూ కేటాయింపుల్లో మాజీ సైనికుల కోటాపై ప్రత్యేక పరిశీలన చేయాలని కమిటీకి దిశానిర్దేశం ఇచ్చారు. అన్ని జిల్లా కలెక్టర్లు, సి సి ఎల్ ఏ ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్.పీ. సిసోడియా ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *