-ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులపై, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి: జెసి శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ వారి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనుసరించి తిరుపతి జిల్లా నందు వివిధ రకాలైన నాణ్యత లేని ఆహార పదార్థాలను అమ్ముచున్న వ్యాపారులు, తయారీదారులు మరియు హోటల్స్ వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి వివిధ రకాలైన వ్యాపార స్తులపై నమోదు చేయబడిన వివిధ కేసులను విచారించుట జరిగినది. ఆ విచారణలో సంబంధిత వ్యాపారులకు మొత్తం ఒక లక్షా 38 వేల రూపాయలు జరిమానా విధించుట జరిగినది. శ్రీకాళహస్తికి చెందిన ఏజెన్సీ షాపు నందు నిలువ ఉన్న ఆహార పదార్థాలు కలిగి ఉండుట వలన సదరు వ్యాపారికి 20వేల రూపాయలు జరిమానా విధించుట జరిగినది. సబ్ స్టాండర్డ్ ఐస్ క్రీమ్స్ అమ్ము వ్యాపారులకు 30000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. బ్యాచ్ నెంబరు, తయారు తేదీ లేకుండా తినుబండారములు అమ్ముచున్న షాపులకు 10000 రూపాయలు జరిమానా విధించడం జరిగినది. వివిధ హోటల్లలో సరియైన నాణ్యత ప్రమాణములు లేని పెరుగు కస్టమర్లకు సప్లై చేసిన హోటల్లకు కూడా జరిమానా విధించించడమైనది, తయారీ తేదీ బ్యాచ్ నెంబరు ఎక్స్పైరీ తేదీ లేకుండా విక్రయించుచున్న పరోటా చపాతి తయారీదారులకు 15 వేల రూపాయలు జరిమానా విధించుట జరిగినది. కోట మండలంలో గల సూపర్ మార్కెట్ నందు ఎక్స్పైరీ అయిన వివిధ రకాల చాక్లెట్లను కలిగి ఉండుట వలన పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగినది. తిరుపతి నగరం నందు గల ఒక బార్ అండ్ రెస్టారెంట్ వంటగది నందు ఎక్స్పరి కాబడిన మసాలా పౌడర్లను కలిగిన బార్ నకు 20 వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది. మరొకరికి సబ్ స్టాండర్డ్ పాలు విక్రయించిన కేసులో 20000 రూపాయల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి నగరం నందు ప్రతి ఒక్క ఆహార పదార్థాలు అమ్మువారు, తయారీదారులు, హోటల్స్ నందు విక్రయించు వారు అందరూ తగు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వ్యాపారము నిర్వహించుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వారి లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని లేనియెడల పది లక్షల రూపాయలు వరకు జరిమానా విధించబడునని తెలియజేశారు.
జెసి గారు ఫుడ్ సేఫ్టీ అధికారులను మరింత ఉధృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకులు ఆరోగ్యం ప్రాధాన్యంగా పనిచేయవలసిందిగా కోరారు. కల్తీలు మరియు నకిలీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, ఫుడ్ సేఫ్టీ అధికారులు జగదీష్, నర్మద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News