-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాస రావు ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL)ల మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ను మరింత విస్తృతం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో APSCHE సెక్రటరీ & CEO ప్రొఫెసర్ MLS దేవ కుమార్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ మెంటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ.. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో ఇంజినీరింగ్ విద్యార్థులు మెంటార్లుగా మారి, పాఠశాల విద్యార్థులకు నూతన ఆవిష్కరణలపై మార్గదర్శనం చేసే అంశంపై చర్చించారు. ఈ సహకారాన్ని అధికారికంగా కొనసాగించేందుకు ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్షా, ఉన్నత విద్యా సంస్థలు పరస్పరం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (ToR) ను మార్చుకున్నారు.
కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్
ATL మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ అమలయ్యే తీరును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఆన్‌లైన్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర పథక సంచాలకులు సూచించారు. ఈ యాప్ ద్వారా ఏటీఎల్ లబ్ధిదారులు, ఇంజినీరింగ్ విద్యార్థుల మెంటార్‌షిప్, ప్రోగ్రామ్ పురోగతి వంటి అంశాల డేటా ఆధారంగా ట్రాక్ చేయొచ్చన్నారు. ఈ యాప్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, APSCHE తరఫున ఒక ప్రతిభావంతమైన కంప్యూటర్ సైన్స్ టీమ్ ఈ బాధ్యతను చేపట్టాలని ఎస్పీడీ గారు కోరారు. సమావేశంలో యూనిసెఫ్ కన్సల్టెంట్ టి. సుదర్శన్, PVP Siddhartha, LBRCE, DMSSVH, VVIT ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News