బెంగుళూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ నోటి సంరక్షణ బ్రాండ్ సెన్సోడైన్, ఆన్‌లైన్‌లో 24 గంటల్లో అత్యంత ఎక్కువ దంత పరీక్ష పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. మహా కుంభ్ 2025లో రికార్డు నెలకొల్పగా, ఈ ప్రయత్నంలో 27 వేల మందికి పైగా వ్యక్తులు దంత పరీక్షలు చేయించుకున్నారు. ఇది చురుకైన నోటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి భారతీయులకు అవగాహన కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. తన నిబద్ధతను మరింత ముందుకు తోడ్కొని వెళ్లేందుకు సెన్సోడైన్ కొత్తగా విడుదల చేసిన రూ. 20 ధరకు లభించే చిన్న టూత్‌పేస్ట్ ప్యాక్‌ను కూడా వితరణ చేసింది. వరల్డ్ ఓరల్ హెల్త్ డే క్యాంపెయిన్‌కు ముందు సెన్సోడైన్ నెలకొల్పిన ఈ రికార్డు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ ప్రచారానికి నాంది పలికిందని హాలియన్ ఇండియా సబ్ కాంటినెంట్ ఓరల్ హెల్త్ కేటగిరీ లీడ్ కిష్లే సేథ్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News