Breaking News

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సజావుగా పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదల అభ్యున్నతికి తోడ్పడే పి–4 సర్వే ను వచ్చే వారంలోగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఏపీ మాస్ బృంద సభ్యులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గుడివాడ నియోజకవర్గం మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏపీ మాస్ అధ్యయన బృందంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి నిరుపేదల పి 4 సర్వే కార్యక్రమం పై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనలో భాగంగా దాతలు, ప్రభుత్వము, ప్రజల భాగస్వామ్యంతో పి 4 సర్వే ని గుడ్లవల్లేరు మండలంలోని కూచికాయలపూడి గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. ఆ సర్వేలో 80 శాతం వరకు సజావుగా కుటుంబ వివరాలు సేకరించడం జరిగిందన్నారు. మిగిలిన 20 శాతం వివరాలను వచ్చే వారంలోగా పూర్తిగా సేకరించాలన్నారు.

అందులో ముఖ్యంగా ఏ కుటుంబానికి ఏ కనీస అవసరాలు లేవు, ఏ జీవనోపాధి కల్పిస్తే వారు వృద్ధిలోకి వస్తారు వంటి వివరాలను ముఖ్యంగా సేకరించాలన్నారు. వారి ఇల్లు మధ్యలో ఏమైనా ఆగిపోయాయా, అలా ఉంటే వారికి నిధులు సమకూర్చి ఇల్లు కట్టించడం లేదా పిల్లల చదువు మధ్యలో ఆగిపోయి ఉంటే ఏదో ఒక మార్గం కల్పించడం, ఏ రకమైన జీవనోపాధి అవసరమో తెలుసుకొని ఆ జీవనోపాదులకు కావలసిన ఆర్థిక సహాయం అందించడం వంటి విషయాల పైన సమగ్రంగా వివరాలు సేకరించాలన్నారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి వివరాలను కూడా సంగ్రహించాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా నైపుణ్యం లో శిక్షణ ఇప్పించి మరింత మెరుగైన ఉద్యోగాలు లభించేలా ప్రయత్నం చేయుటకు సంబంధించిన వివరాలను కూడా సేకరించాలన్నారు.
ఏ పని చేస్తే అక్కడి నిరుపేదలకు ఉపయోగం కలుగుతుందో ఆ పనులు చేయుటకు సంబంధించిన పూర్తి వివరాలను సంగ్రహించాలన్నారు. అందరిని ఒక పోర్టల్లోకి తీసుకొని వచ్చి దాతలు అయిన మెగా ఇంజనీరింగ్ యాజమాన్యం వారి సహకారంతో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, గుడివాడ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, ఏపీ మాస్ అధ్యయన బృందం నాయకురాలు ఏ కళామణి, డివిజనల్ పంచాయతీ అధికారి పి సుజాత, ఎంపీడీవో విజయ సారధి తదితర అధికారులు, ఏపీ మాస్ అధ్యయన బృందం సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *