Breaking News

రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 13 నూతన జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో ఛైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డులలో (బాలల న్యాయ మండలులలో) సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ప్రొఫార్మాలో వారి అర్హత దృవీకరణ పత్రాల నకళ్ళతో పాటు 9 ఏఫ్రిల్ 2025 లోపు విజయవాడలోని ఈ శాఖ డైరక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. విద్యార్హతలు, అనుభవము, ఎంపిక విధానం, ఇతర వివరాలకు http://wdcw.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టుల ద్వారా మాత్రమే పంపాలని, ఈ మెయిల్స్ ద్వారా పంపిన దరఖాస్తులు లేదా అసంపూర్తి దరఖాస్తులు అంగీకరింపబడవన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *