Breaking News

స్వతంత్రం వచ్చి 77 ఏళ్లయిన క్షేత్రస్థాయిలో పరిష్కారాల శూన్యం

-వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్లు వెంకటేశ్వర్లు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ప్రకటనలు మాత్రమే చేస్తోందని క్షేత్రస్థాయిలో పరిష్కారాలు జరగటం లేదని వాయిస్
ఫర్ చేంజ్ గౌరవ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వర్ విమర్శించారు వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి77 ఏళ్ల తర్వాత కూడా సమాజాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయన్నారు వాటిని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు దేవాలయ భూములు అన్యాక్రాంతమైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు లేవన్నారు అవినీతిని నిరోధించి అందరికీ విద్యా, వైద్యం ఉచితంగా అందించడం ద్వారా సమాజ అభివృద్ధి చేయవచ్చు అన్నారు అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు చట్టాలను రూపొందించి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. 276037 సున్నా ఖాతాలు ఉన్నాయని 22a భూముల అంశం పట్టాభూముల వివరాల ట్యాంపరింగ్ తదితర అంశాలు సమస్యాత్మకంగా కొనసాగు తున్నాయన్నారు
ఎన్ని ప్రభుత్వాలు మారిన రైతులకు భూ సమస్యలు పరిష్కరించి పాస్ బుక్స్ ఇచ్చే అంశం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా వందల కోట్ల విలువైన దేవాలయాల భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చిక్కుకునే ఉన్నాయని సంబంధిత అధికారులు చట్టాల్లో ఉన్న లోపాల ఆసరాగా కబ్జాదారులపై చర్యలు తీసుకోవటం లేదన్నారు అవినీతి పరులైన రాజకీయ నాయకులు ప్రజలని ఉచిత పథకాల హామీలతో సోమరి పోతులుగా మారుస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ లో కొత్త ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కొత్త రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ ఇంకా పట్టా లెక్కలేదని పి4 లో విద్య వైద్యం ఉచితంగా ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వెంకటేశ్వర్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో విరవల్లి రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *