-నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో పలువురి సమస్యలను స్వయంగా విన్న మంత్రి దుర్గేష్
-త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ జనవాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. గంటల తరబడి ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అండగా ఉంటామని భరోసానందించారు. తామున్నదే ప్రజలకు సేవ చేయడానికని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పందన పట్ల వినతులు సమర్పించిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News