Breaking News

జన సైనికులకు అండగా ఉంటా సమీక్షలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన సైనికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన నేతలతో కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన డివిజన్ అధ్యక్షులు, ధార్మిక మండలి సభ్యులు, సమన్వయకర్తలు, సిటీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి జనసైనికుల , నాయకుల సమస్యలను విన్నారు. వారి నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు. పది నెలల కూటమిపాలనలో పశ్చిమ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి చర్చించారు.
జన సైనికులు జీవనోపాధి మార్గాలు ఎంచుకొని ఆర్థిక అభ్యున్నతి సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జన సైనికులకు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *