Breaking News

అంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సాగు విధానాల పై సంతృప్తి వ్యక్తం చేసినకేరళ రైతుల బృందం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు (ఏప్రిల్ 3 వ తేదీన) గుంటూరు జిల్లాలో “ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం” (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కేరళ రైతుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. రెండవ రోజు గురువారం (3 వ తేదీ ఏప్రిల్ ) గుంటూరు జిల్లాలో పర్యటించింది. వీరిని జిల్లా డిపిఎం రాజకుమారి, టీ ఎల్ శ్రీనివాసు, టీఎల్, ఎన్ఆర్వోహుమాయూన్లుస్వాగతించారు.

కేరళ రైతు బృందం తొలుత మంగళగిరిమండలంలోని నూతక్కి గ్రామంలో రైతు శ్రీనివాస్ రెడ్డి క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేస్తున్న అరటి A గ్రేడ్నమూనా మరియు అంతర పంటలను పరిశీలించారు. ఆకుకూరలు, కూరగాయల పంటల గురించి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ప్రకృతి వ్యవసాయం లో దాగివున్న శాస్త్రీయతను ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, థిమాటిక్ లీడ్ శ్రీనివాసులు వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో బృందం సభ్యుల అనుమానాలను నివృత్తి చేశారు. కౌలు రైతు మల్లికార్జున సాగుచేసిన బంతి, రాటూన్ రకం అరటి పంటలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం సాగు విధానాలు, పెట్టుబడి, రాబడి తదితర విషయాలను రైతు కుటుంబం తో అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కొల్లిపరమండలంలోని దావులూరిపాలెం గ్రామంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ విధానాలను, ప్రకృతి వ్యవసాయం లో మహిళా సంఘాల సభ్యుల పాత్రను గురించి తెలుసుకున్నారు. అలాగే రైతు వసంతకు చెందిన పసుపు A గ్రేడ్ మోడల్, న్యూట్రి గార్డెన్ సందర్శించిన రైతు బృందం సంతృప్తిని వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *