విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ అదనపు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎల్ఎస్ఎమ్ రమ్యశ్రీ ని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 కార్యవర్గ సభ్యులు గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు రవాణా కమిషనర్ ఎల్ఎస్ఎమ్ రమ్యశ్రీ మాట్లాడుతూ శాఖపరంగా ప్రజలు కోరుకున్న సేవలను అందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించి శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు ఉద్యోగులు ఉండాలన్నారు. ఉద్యోగుల సంబంధించి సమస్యలు ఎమున్నాను కూడా మా దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. జోన్2 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యం. రాజుబాబు మాట్లాడుతూ మొట్టమొదటి మహిళ ఆర్టీవో గా రవాణాశాఖలో మొదలు పెట్టి ఈనాడు మొట్టమొదటి మహిళ అదనపు రవాణా కమిషనర్ స్థానానికి రమశ్రీ రావడమనేది రవాణాశాఖలో ఒక రికార్డు సృష్టించడమేనని అన్నారు. అదనపు రవాణా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి రమశ్రీ ని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే వారిని ఆయన గుర్తుచేశారు. శాఖ పరంగా ప్రజలు కోరుకున్న సేవలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
రాజుబాబు తో పాటుగా జోన్ 2 సంఘం సహధ్యక్షులు డి రామ్మూర్తి, ఉపాధ్యక్షులు వి నాగ శంకర్, ప్రియాంక, కోశాధికారి కె రామచంద్రరాజు, కార్యనిర్వాహణ కార్యదర్శి బి మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శిలు పి దుర్గాప్రసాద్, కె సత్యనారాయణ ఉన్నారు.
Prajavartha Online Telugu News