Breaking News

అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో త్రాగునీటిని అందించే అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్ లో నీటి ట్యాంక్ ను కూడా ప్రతి 15 రోజులకు శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ నిర్దేశిత సమయానుగుణంగా ఆహారం అందించాలన్నారు. క్యాంటీన్ల వద్ద లైట్లు, మొక్కలను ఏర్పాటు చేయాలని, ఏమైనా మరమత్తులు ఉంటే ఎప్పటికప్పుడు చేయాలని, క్యాంటీన్ల పరిశీలన నోడల్ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *