Breaking News

గనుల బ్లాకులు వేలం,ఆపరేషనైజేషన్ పై పియం ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో గనుల బ్లాకులు వేలం మరియు ఆపరేషనలైజేషన్ అంశాలపై కెటగిరీ ఎ లోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు.దేశంలోని 21 రాష్ట్రాల్లో గనులకు సంబంధించిన రాష్ట్రాలను ఎబిసి అనే మూడు కేటగిరీలుగా విభజించగా ఎ కేటగిరీలోని ఒడిస్సా,కర్నాటక,రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్, ఝార్ఖండ్,చత్తీస్ ఘడ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సిఎస్ లతో పియం ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ బ్లాకుల వేలం మరియు ఆపరేషనలైజేషన్ కు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఇతర అంశాలపై సమీక్షించారు.అంతేగాక వీటికి సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాలను కూడా ఆయన సమీక్షించచారు.ఇందుకు సంబంధించిన ప్రక్రియనంతటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు సిఎస్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని పియం ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా సిఎస్ లను ఆదేశించారు.
ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మినరల్ బ్లాకుల వేలం,ఆపరేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా,గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పిసిసిఎఫ్ అజయ్ కుమార్ నాయక్,అదనపు పిసిసిఎఫ్ రాహుల్ పాండే,ఎపి పిసిబి సభ్య కార్యదర్శి శ్రీశరవణన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *