Breaking News

ఘనంగా ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మావేశం

-న‌గరానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌టానికి మంత్రి టిజి భ‌ర‌త్ స‌హ‌క‌రించాలి
-ఆర్య‌వైశ్య ఆత్మీయ స‌మావేశంలో కోరిన ఎంపి కేశినేనిశివ‌నాథ్
-హాజ‌రైన భారీ ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి టిజి మంత్రి, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ‌గోపాల్, కుడా చైర్మ‌న్ సోమిశెట్టి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ న‌గ‌రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చి, ఉద్యోగావ‌కాశాలు పెరిగే విధంగా రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టిజి భ‌ర‌త్ స‌హ‌క‌రించాల‌ని విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కోరారు. ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ ఆధ్వ‌ర్యంలో విద్యాధ‌రపురంలోని ఎస్ క‌న్వేన్ష‌న్ హాల్ నందు ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మావేశం శుక్రవారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఎంపి కేశినేని శివ‌నాథ్, మంత్రి టిజి భ‌ర‌త్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ‌గోపాల్ (తాత‌య్య‌), కుడా ఛైర్మ‌న్ సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారి చిత్ర‌ప‌టానికి ముందుగా పూలు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఆర్య‌వైశ్యులు వ్యాపారులు చేసుకుంటూ ఆనందంగానే వుంటేనే రాష్ట్రం సంతోషంగా వుంటుంద‌న్నారు. వ్యాపారం జ‌రిగి ట్యాక్స్ లు క‌ట్ట‌డం వ‌ల్ల రాష్ట్రానికి ఆదాయం వ‌స్తుంద‌న్నారు. సేవ రంగంలో ఎప్పుడు ముందుండే ఆర్య‌వైశ్యులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించిన పీ4లో మార్గ‌ద‌ర్శికులుగా మారి బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని కోరారు.

ఎన్నిక‌ల ముందు చెప్పిన‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పొట్టిశ్రీరాముల వ‌ర్ధంతి, క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆత్మార్ప‌ణ దినాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారం నిర్వ‌హించే ఏర్పాటు చేసిందన్నారు. అలాగే మంత్రి టిజి భ‌ర‌త్ త‌న‌కు సోద‌ర స‌మానుడ‌ని, ఎమ్మెల్యే శ్రీరామ రాజ‌గోపాల్ (తాత‌య్య‌) త‌న‌కు అన్న‌య్య‌గా భావిస్తాన‌ని తెలిపారు. ఆర్య‌వైశ్యులు ఏ స‌మ‌స్య‌నైనా సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. డూండీ రాకేష్ అందుకు భిన్నంగా పోరాట ప‌టిమ‌ను అల‌వ‌ర్చుకుని గ‌త ప్ర‌భుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులకు అండ‌గా నిల‌బ‌డ్డాడ‌ని కొనియాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ మ‌న‌సులో మంచి స్థానం సంపాదించుకున్నార‌ని తెలిపారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కి ఆర్య‌వైశ్యులు ఆత్మీయ స‌త్కారం చేశారు. ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ మాట్లాడుతూ   ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ సహకారంతో ఆర్య‌వైశ్యులు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మొదట నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందచేస్తున్న ఆర్య‌వైశ్య సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య‌వైశ్య నాయకులు, సభ్యులు, ఎన్డీఏ కూటమినేతలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *