Breaking News

ఘనంగా డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 118వ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ రోజు  డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరపల్లి ఆంజనేయులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేవరపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరుగా పేరుగాంచిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారని, సమానత్వం,సౌబ్రాతృత్వం ప్రాతిపదికనే దేశ సమైక్యత సాధ్యపడుతుందని చాటిన జాతీయవాదని, జాతీయ ఉద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి బాబు జగజ్జివన్ రామ్  అన్నారు. విద్యార్థి నాయకుడిగా సమాజంలోని అంతరాలను రూపుమాపేందుకు అనేక తాత్విక సిద్ధాంతాలను అధ్యయనం చేశారని, 1934లో బీహార్ లో సంభవించిన తీవ్ర భూకంప సహాయక చర్యల్లో పాల్గొని అనేకమంది జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. పేద,అణాగారిన వర్గాల అభ్యున్నతికి గాంధీజీ చేస్తున్న కృషి జగజ్జీవన్ రామ్ గారికి ఆదర్శప్రాయం అయిందన్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల ప్రభావంతో అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని ఆయన ఉద్యమించారని, స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు జీవితం గడిపారన్నారు. వ్యవసాయ కూలీల హక్కుల కోసం కేతీహార్ మజ్దూర్ సభను స్థాపించి వారి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడారు అన్నారు. దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి, తద్వారా కిందివర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేరువయ్యేలా చేయాలని ఉద్యమించారు అన్నారు. అంటరానితనం నిర్మూలనకు వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు పొందేందుకు, ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో సీట్లు రిజర్వేషన్ కావడానికి విజయవంతమైన పాత్ర పోషించారు అన్నారు. రాజ్యాంగంలో ఇటువంటి మార్గదర్శకాలు ఉండటం వల్ల సామాజిక, రాజకీయ సాధికారతకు, ఆర్థిక పురోభివృద్ధికి సాధనాలుగా ఉంటాయని భావించారన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటినుండి దళితుల రిజర్వేషన్లకు కాపలాదారుడిగా, ఉద్యోగ, విద్యా రంగాల్లో వారి హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడిన వ్యక్తి జగజ్జివన్ రావు గారు అని అన్నారు. బాబూజీ 28 ఏళ్లకే బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపికయ్యారని, నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా కొనసాగారని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ సవరణ చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేశారని, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చట్టాల ద్వారా సామాజిక భద్రత అంశానికి పునాది వేశారని, ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో వృత్తులు చేయడానికి నిషేదించారని, కాంట్రాక్టు లేబర్ సంక్షేమ విధానాన్ని ప్రవేశపెట్టారని, స్వాతంత్రానంతరం కార్మిక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి కార్మికుల స్థితిగతులు, అభివృద్ధి వంటి పలు విషయాలపై నివేదిక కోరారని 1969లో కమిటీ సమర్పించిన నివేదికలో అనేక ప్రయోజనకర ప్రతిపాదనలు అమలు చేశారు అన్నారు. రైల్వే శాఖ మంత్రిగా రైల్వేలను ఆధునికరించి సంస్కరణలు చేపట్టారని, లక్షలాది దళిత అనగారిన వర్గాలకు రైల్వేలో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెరుగుదలకు బాటలు వేశారన్నారు. దేశ రక్షణ మంత్రిగా ఆయన చూపిన దీక్ష దక్షతలు నేటికీ ఆదర్శనీయమే అన్నారు. వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికారని, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాదికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, మహమ్మద్ ఆఫీజ్ రెహ్మాన్, మల్లెల రామకృష్ణ, పరశపోగు విజయకుమార్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి పుట్ల రమణ, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, మల్లెల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *