Breaking News

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

-వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనందరికీ ఆదర్శప్రాయుడని.. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *