-కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి
-బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసారు.
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ గుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు లు మాట్లాడుతు పశ్చిమ వైసిపి కార్యాలయంలో నేడు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. బాబు జగజీవన్ రామ్, డా బి ఆర్ అంబెడ్కర్, జ్యోతిరావు పూలె గారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా జగన్ మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి భస్మాసురుడి హస్తం లాగా మా నెత్తిన మేము చేయి పెట్టుకున్నామని గోడు వెలకక్కుతున్నారన్నారు. రానున్న రోజుల్లో మల్లి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారని, బాబు జగజీవన్ రామ్ గారు కళలు కన్నా స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుందన్నారు. భారత దేశంలో 30 సంవత్సరాలు వివిధ శాఖలలో కేంద్ర మంత్రిగా పని చేసిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారని కొనియాడారు. నేటి యువత బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోను, స్కూల్ లలోను బాబు జగజీవన్ రామ్ గారు దేశానికీ అందించిన సేవల గురించి తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ గుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, రాష్ట్ర ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బుదాల శ్రీనివాసరావు, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు పొలిమెట్ల శరత్, పశ్చిమ ఎస్సి సెల్ అధ్యక్షులు గంపల నవీన్, ఎస్సి సెల్ నాయకులు దాసి జయప్రకాష్ కెనెడి, కామళ్ల కోటేశ్వరరావు జోజి, నాగేళ్ల సంగీత బాబు, గోమతోటి వినోద్ పాల్, మద్దిరాల కమలాకర్, గాధల లాజర్, రేవులగడ్డ విజయ్, గాలిదుర్గారావు, బోయల్ల రాజేష్, వడ్డాది జీవన్, మడికి బాబురావు, దొడ్డ సురేష్, రెండపోగు క్రాంతి, కూరాకుల నాగ, పదిలం రాజశేఖర్, మాజీ శ్రీనివాసరావు, కరీమ్ ఖాన్, రుద్రపాటి స్రవంతి, దుర్గాభవాని, ఉప్పాడ రాజకుమారి రెడ్డి, ఏనుగుల సునీల్, వానపల్లి రవీంద్ర, దుక్క హరి భాస్కర్, అల్లం యువ కుమారి, మల్లాది శివ కుమార్, అబ్దుల్ ఘని, తాడిశెట్టి పెద్ద బాబు, పల్లె బాబు, కర్రీ గౌరీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News