Breaking News

బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద సీతారాముల కల్యాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీతారామకల్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద సీతారాముల కల్యాణం నిర్వహించారు. కల్యాణ మూర్తులను ప్రత్యేక వాహనంపై వాయిద్యాల నడుమ కల్యాణవే దిక వద్దకు తీసుకువచ్చారు. పోల వరపు వెంకటకృష్ణ సుకుమార్, రాధిక దంపతులు ఉత్సవ మూర్తులకు కల్యాణం నిర్వహించారు. బూర్లగడ్డ కృష్ణకిషోర్, ధనలక్ష్మీ దంపతులు మూలవిరాట్ సన్నిధిలో కళ్యాణం జరిపారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని మోడరన్ కేఫ్ యజమాని మురళి రూ.57 వేలకు పాడుకున్నారు. కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు నీలం భానుమూర్తి, ఉపాధ్యక్షుడు బూర్లగడ్డ కృష్ణకి షోర్, కార్యదర్శి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి పోతిన రామప్ర సాద్, సభ్యులు కళ్యాణ వేడుకలను పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *