విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి మరియు పిఎంకెఎంఫైన్ ఆర్ట్స్ , సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఈ పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు . తమ బృందంతో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుజనా చౌదరిని కలిసి చంద్రన్న వజ్రోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాంస్కృతిక , నృత్య, జానపద, కూచిపూడి, భరతనాట్యం, తదితర కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులను అంద చేస్తామని సినీ దర్శకులు వెంకటరమణ పసుపులేటి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో డా. అశోక్ కొప్పుల, డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు, కళా రత్న అవార్డు గ్రహీత దామోదర గణపతి. శొంఠి ఈశ్వరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News