విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టపడేతత్వం మరియు ప్రణాళికాబద్దంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. బుధవారం విజ్ఞాన మందిరం నందు స్మార్ట్ టెక్స్ వారు మరియు నగర పాలక సంస్థ ఆధ్వరంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యమంలో కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలలో మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా ఐ.టి రంగం యెక్క సేవలను వినియోగించుకుంటుందన్నారు. వైజాగ్ లో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఆధ్వరంలో మెగా జాబు మేళాను ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని, వారిని స్పూర్తిగా తీసుకొని గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో కూడా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాగా చువుకొని ఎటువంటి ఉద్యోగాలు లేకుండా యువత చాలా మంది ఉన్నారని, అటువంటి వారికోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలలో కంటే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే ప్రతి పనిలో నిష్ణాతులుగా ఉండాలన్నారు. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు రావాలంటే కమ్యునికేషన్ స్కిల్స్ ఉండాలని, దానితో పాటు కష్టపడే తత్వం, ప్రణాళికాబద్దంగా పనులు చేయగలిగి ఉండాలని, అప్పుడు మాత్రమె ఎటువంటి పనిలోనైనా విజయం సాధించవచ్చన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమం వలన ఉద్యోగార్దులలో ఉన్నటువంటి స్కిల్స్ ను బయటకు తీయుటయే కాక ఏవిధంగా ఇంటర్వ్యూ పేస్ చేయాలో స్మార్ట్ టెక్స్ వారు వివరిస్తారన్నారు. ఈ స్మార్ట్ టెక్స్ వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నగర పరిధిలో చదువు పూర్తి చేసుకొని ఉన్న యువత కోసం ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించి, సుమారు 50 కంపెనీలతో మెగా జాబు మేళా ఏర్పాటు చేసి, 10 వేలకు పైగా జాబ్స్ వచ్చేలా కృషి చేయుట ఎంతో అభినందనీయమన్నారు. ఈ జాబ్ మేళాలో జాబ్ కోరకు ఇప్పటికే 2 వేలకు పైగా క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేకొని రిజిస్టర్ చేసుకున్నారని, ఇంకా రిజిస్టర్ చేసుకోదలచిన వారు సచివాలయాలలో ఏర్పాటు చేసిన క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని, తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కావున స్మార్ట్ టెక్స్ మరియు నగర పాలక సంస్థ అందిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని మెగా జాబ్ మేళాకు హాజరయ్యి, విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందాలని తెలియచేశారు. అంతేకాక త్వరలోనే జాబ్ మేళా నిర్వహించు ప్రాంతం మరియు తేదీ వంటి వివరాలను అభ్యర్ధులకు తెలియచేస్తామన్నారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్లు డి. శ్రీనివాసరావు, టి. వెంకట కృష్ణయ్య, సెక్రటరీ పి. శ్రీనివాసరావు, మేనేజర్ బాలాజీ బాషా, స్మార్ట్ టెక్స్ సంస్థ ప్రతినిధులు దివ్య వారి బృందం, అభ్యర్ధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News