ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగిన బాధ్యతల్ని నిర్వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగిన బాధ్యతల్ని నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహనా కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు మరియు అణగారిన మరియు వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన మరియు సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని నిరుపేదలకు అందే విధంగా వారిని చైతన్యవంతం చేయాలని అన్నారు. ఎవరు కూడా నిరుపేదలుగా ఉండకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వెనుకబడిన, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, నిరుపేదలను వంటి 7 క్యాటగిరీలు గా విభజించి ఒక్కొక్క క్యాటగిరీలో అనగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కు చెందిన కులాల వారికి ఐదు రకాల ప్రభుత్వ పథకాలను, దివ్యాంగులకు కొన్ని, మహిళలకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టి వాటి యొక్క ప్రయోజనాలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని గంధం సునీత స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిబ్బంది అందరూ ఈ పథకాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించిన నాడే ఆశించిన సత్ఫలితాలు వస్తాయన్నారు. అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలపై వర్క్‌ షాప్ నిర్వహించి వారికి పథకాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అంగన్వాడి వర్కర్స్ తో మమేకమై ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. జిల్లా లోని వివిధ సమన్వయ శాఖల ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్‌ షాప్ నిర్వహించారు.

ఈ సమావేశంలో రాజమహేంద్రవరం  శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ ఏ గాయత్రి దేవి, డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, లీగల్ ఎయిడ్ డిప్యూటీ చీఫ్ పీఎంఆర్ ప్రేమ్ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు ఎమ్ సుబ్బారావు, పివిడి ప్రసాద్, యు. రాజు,  జాబిన, ఆర్ శ్రీను తదితరులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *