Breaking News

ఎలుకలు నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేయడం వలన వీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు.

-వ్యవసాయ కళాశాల డీన్ డా. శ్రీనివాస్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఎలుకలు నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేయడం వలన వీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని  వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ అన్నారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం విద్యార్థులు RAWEP ప్రోగ్రామ్ లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమం కోరుకొండ మండలం, శ్రీరంగ పట్నం గ్రామం లో జరుగుతుంది.  ఇందులో భాగంగా ఆరవ రోజు బుధవారం ఎలుకల యాజమాన్యం అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలుకలు ప్రస్తుత కాలంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య అని చెప్పారు. గత దశాబ్ద కాలంలో ఎలుకల నివారణ కొరకు రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈ నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేయడం వలన వీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఈ అంశం పై అవగాహన కలిగించడానికి కళాశాల నుండి ప్రొఫెసర్ డా. వసంత భాను రైతుల సమక్షంలో ఎలుకల నివారణ మందు ఎలా తయారు చేయాలో విద్యార్థుల ద్వారా చేసి చూపించారు. మనుషులకన్నా ఎన్నో రెట్లు ఎలుకల వున్నాయని, వీటి నివారణ ద్వారా చాలా వరకు పంట దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. సామూహికంగా రైతులందరూ ఒకేసారి ఎలుకల నివారణ చేపట్టడం ద్వారా ఎలుకల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల NSS ఆఫీసర్స్ డా.హెచ్.శ్రీనివాస్, డా. సునీత, గ్రామస్తులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ‎

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *