-పార్కుల అభివృద్ధిపై సంయుక్త పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాయికాపురం ఎల్బీఎస్ నగర్ లో నూతనంగా అభివృద్ధి చెందబోతున్న పార్కు బోరింగ్ పనులు చేపట్టారు ఇంజనీరింగ్ సిబ్బంది. గురువారం సాయంత్రం ఇంజనీరింగ్ ఇంచార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, డెప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ ఆ పనులను సంయుక్తంగా పరిశీలించారు. ప్రజలకు మరింత అహ్లాదకరమైన వాతావరణం పెంచేందుకు నూతనంగా పార్కులను అభివృద్ధి చేస్తున్నారు విఎంసి సిబ్బంది అందులో భాగంగా పైకాపురం ఎల్బీఎస్ నగర్ లో నూతనంగా పార్క అభివృద్ధి పనులు చేపట్టారు విఎంసి అధికారులు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, ప్లే ఐటమ్స్ తో ఈ పార్క్ ని అభివృద్ధి పరుస్తున్నారు.
Prajavartha Online Telugu News