-జయపద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
-శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, మంత్రి సత్యకుమార్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో పేదరికం నిర్మూలించటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో పీ4 విధానంకు శ్రీకారం చుట్టారు. సమాజంలో పేదరికం నిర్మూలించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫౌండేషన్ గా పనిచేస్తుంది..దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు, కార్యచరణలో పెట్టే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
జగ్గయ్యపేట పట్టణం పీవీఆర్ గార్డెన్స్ లో జయపద్ర ఫౌండేషన్ చైర్మన్ , తెలుగుదేశంపార్టీ పొలిటికల్ సెక్రటరీ తొండపు దశరథ జనార్థన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై.సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా భరతమాత చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జయపద్ర ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎంపీ కేశినేని శివనాథ్ కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద ప్రజలకు, విద్యార్ధులకు ఆరోగ్య పరంగా వైద్య సేవలు అందిస్తున్న జయప్రద ఫౌండేషన్ సేవలు కొనియాడారు.ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఫౌండేషన్ సేవలు విస్తరించాలని టి.డి.జనార్ధన్ కి సూచించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమలు వచ్చే విధంగా సహకరించాలని మంత్రి సత్యకుమార్ ను ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.
నేటి యువత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన కర్మభూమిలో పనిచేయండి, జన్మభూమికి సేవ చేయండి నినాదాన్ని స్పూర్తిగా తీసుకుని జన్మభూమిలో సేవకార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా నారా భువనేశ్వరి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నోసేవకార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవకార్యక్రమాల స్పూర్తితోనే తాము కూడా సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఈ లక్ష్య సాధనలో పలు సేవా సంస్థలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం వుందన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఆర్.రాఘవేంద్ర, శంకర్ నేత్ర వైద్యాలయ సిబ్బంది డాక్టర్ రోహిత్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సెక్రటరీ వినయ్, విద్యాబారతి ఉపాధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ, జయపద్ర ఫౌండేషన్ వైస్ చైర్మన్ గౌతమి సరోజ, జయపద్ర ఫౌండేషన్ ఆఫరేటివ్ ఆఫీసర్ ఛాముండేశ్వరి, కట్టా నరసింహారావు లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News