మంచి రోజులు వచ్చాయి రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చింది..

-రాజవోలు గ్రామంలో రైతులకు వ్యవసాయ యాంత్రికరణలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త
మంచి రోజులు వచ్చాయని రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చిందని, రైతన్నకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం ముందుకెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

మంగళవారం రాజవోలు గ్రామంలో మూడు కిషీ ట్రాక్టర్లు (పవర్ టిల్లర్) ఒక రోటోవేటర్, బ్యాటరీ స్ప్రేయర్లు అర్హులైన రైతులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లులకు తోలిన ధాన్యానికి సొమ్ములు చెల్లించకుండా నెలల తరబడి కాలయాపన చేసి రైతులను దగా చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా కిషీ ట్రాక్టర్ (పవర్ టిల్లర్) మొత్తం ధర 2,29500/- ప్రభుత్వ సబ్సిడీ 1లక్ష రూపాయలు, రైతు చెల్లించవలిసింది 129500/-, రోటోవేటర్ మొత్తం ధర 132600/- ప్రభుత్వ సబ్సిడీ 50000/- రైతు చెల్లించవలసినది 82600/-, బ్యాటరీ స్ప్రేయర్లు మొత్తంగా 4590/- ప్రభుత్వ సబ్సిడీ 1000 రూపాయలు రైతు చెల్లించవలసినది 3590/- ఇలా అనేక రకాల యాంత్రికరణలను అర్హులైన రైతులకు అందిస్తున్నామని, రైతు వద్ద నుండి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటల లోపు సొమ్ములు రైతులు ఖాతాలోకి చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, ఎం.పీ.డీ.వో డి.శ్రీనివాసరావు, ఏ.వో భీమరాజు, నిమ్మలపూడి రామకృష్ణ, కురుకూరి కిషోర్, వల్లేపల్లి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు చాపల వెంకటరావు, మట్ట శ్రీను, బొప్పన శ్రీను, అంగర రాజు, ఒకలపూడి ఆదినారాయణ, ముత్యాల రామారావు, మరపట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *