Breaking News

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది

–మాచవరంలో అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామ నవమి సందర్బంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని మాచవరంలో శ్రీరామ నవమి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పాల్గొన్నారు. సుమారు పది వేల మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. దానాల్లో కెల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్పారు. సీతారామ కళ్యాణంతో పాటుగా అన్నదానాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆ శ్రీరాములు చల్లని చూపు ప్రజలందరిపైనా ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో చెరుకూరి కృష్ణకుమార్, కంచర్ల రాము, వల్లభనేని సతీష్, సుగసాని కృష్ణప్రసాద్, కొనకళ్ళ ప్రసాద్, సుధాకర్, అనుమోలు పూర్ణచంద్రరావు, వెల్లంకి సుధాకర్, మండవ గణేష్, శివన్నారాయణ, చలసాని అనిల్‌తో పాటుగా కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *