విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా నియమితులైన పొనకళ్ల నవ్యశ్రీ, ఆమె భర్త మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బ్రహ్మాయ్య ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎ.ఎమ్.సి ఛైర్మన్ పొనకళ్ల నవ్యశ్రీ, బ్రహ్మయ్య దంపతులు మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) నేతృత్వంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలుసుకున్నారు. తమపై నమ్మకంతో మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు పొనకళ్ల దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎ.ఎమ్.సి ఛైర్ పర్సన్ గా ఎన్నికైనందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలియజేయటంతోపాటు వారిద్దరిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి గూడెం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చేపల మడుగు కాంతారావు, జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు వై.నరసింహారావు, మైలవరం టౌన్ అధ్యక్షుడు గజరావు శ్రీనివాసరావు, మేరుగు నాగేశ్వరరావు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News