గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో గురువారం జరిగిన 16వ ఫైనాన్స్ కమిషన్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ మీటింగ్ లో పాల్గొన్న గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జి మేయర్ షేక్ సజిలా. ఈ సందర్భంగా ఇంచార్జి మేయర్ గారు మాట్లాడుతూ, తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో 16వ ఫైనాన్స్ కమిషన్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ మీటింగ్ జరిగిందన్నారు. మీటింగ్ లో గుంటూరు నగరపాలక సంస్థ తరుపున పాల్గొని, గుంటూరు నగరంలో అభివృద్ధి పనులకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా గారు, సెక్రటరీ రిత్విక్ రాజానమ్ పాండే గారు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు, అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధ గారు, జాయింట్ డైరెక్టర్ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఈఈ సుందర్ రామి రెడ్డి గారు, వివిధ కార్పొరేషన్లు మేయర్లు మరియు మున్సిపాలిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News