Breaking News

హాయిగా నిదురించేందుకు నవతరం నాలుగు రకాల పరుపులు ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషి ఆరోగ్యానికి మంచి నిద్ర చాల అవసరం అందుకోసమే పెప్స్ వినియోగదారుల ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి అనుకూలమైన పరుపులను వారు ప్రశాంతంగా నిదురించుటకు నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టినది అని పెప్స్ ఇండస్ట్రీస్ సహా-వ్యవస్థాపకులు జి.శంకర్ రామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కొత్త రకాల పరుపుల శ్రేణిని పెప్స్ ఆవిష్కరించినది. పెప్స్ కంఫర్ట్, పెప్స్ సుప్రీం మరియు పెప్స్ రెస్టోనిక్ మెమరీ ఫోమ్ అనే ఉత్పత్తులు ఎంతో సౌకర్యవంతమైనవి మరియు మన్నిక కలిగినవి తెలిపారు.పెప్స్ కంఫర్ట్ చక్కని మన్నిక మరియు కుంగిపోకుండా ఉండేందుకు అత్యుత్తమ స్టీల్ హై కార్బన్, ఆయిల్ రహిత వైర్లుతో యురోపియన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడినవి. ఐరన్-రెసిస్టెంట్ ఫ్లాట్-అల్లిక పాలియస్టర్ ఫాబ్రిక్ మరియు 93% బయోడిగ్రేడబుల్ సామగ్రితో పర్యావరణ అనుకూలమైన నిద్ర పరిష్కారాన్ని అందిస్తుంది.
పెప్స్ సుప్రీమ్ ఎలాటి నిద్రా భంగం కలగకుండా ప్యాకెట్ స్ప్రింగులు కలిగి హాయిగా నిదురించుటకు వీలుగా రూపొందించారు. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా పెప్స్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించటం తమకు గర్వంగా ఉంది అన్నారు.అమెరికన్ రెస్టోనిక్ గ్రేట్ స్లీప్ లో భాగంగా, పెప్స్ సానిబెల్ బోన్నెల్ ప్లష్ మెమరీ ఫోమ్ అనేది హైబ్రిడ్ పరుపు, ఇది ఉష్ణోగ్రత మరియు పీడన శక్తిని నియంత్రిస్తుంది. అధిక-కార్బన్ టాటా స్టీల్ బోనెల్ స్ప్రింగ్స్ తోటి సుఖవంతంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెప్స్ 5 ప్రత్యేకమైన స్టోర్లు మరియు 600 మల్టీ-బ్రాండ్ స్టోర్లను కలిగి తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాది. నూతనంగా ఆవిష్కరించిన ఉత్పత్తులు అన్ని స్టోర్లలో లభిస్తాయి. పెప్స్ ప్రత్యేక వెబ్ సైట్ : https://pepsindia.com లో కూడ లభిస్తాయని చెప్పారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *