Breaking News

ఏపీ జూనియర్ వెటర్నరీ సహాయకుల సంఘం ఎన్నికల వాయిదా

-ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేదీన లబ్బీపేట లోని వెటర్నరీ హోమ్ లో నిర్వహించాల్సిన ఎపిఎల్ఎస్ఎ, ఎపిజెఓయస్ఎ, ఏపీవిఓఎస్ఎ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి కె. జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా యొక్క ధ్రువీకరణ ప్రతులు, మినిట్స్ పుస్తకం, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర పత్రాలను సంఘ నిర్వాహకులు నిర్ణీత వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించనందున ఎన్నికలు వాయిదా వేయడానికి కారణమన్నారు. సంఘ నిర్వాహకులు ఎన్నికల సంఘం కోరిన పత్రాలను అందజేసిన తర్వాత కొత్త ఎన్నికల తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా వేసిన అంశాన్ని సంఘం రాష్ట్ర నాయకులకు ఇప్పటికే తెలియజేశామని వివరించారు. ఎన్నికల అదికారుల గా నియమితులైన కె.జగదీశ్వరరావు ఎ. రంజిత్ కుమార్ నాయుడు డి.వేణుమాధవ్ లు సంయుక్తం గా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఓటు హక్కు ఉన్న సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని జగదీశ్వర రావు ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *