Breaking News

16వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ డా. అర‌వింద్ ప‌న‌గారియా మరియు స‌భ్యులకు సాదర వీడ్కోలు

రేణిగుంట,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరo శుక్రవారం ఉదయం ఢిల్లీ కి తిరుగు పయనమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా మరియు సభ్యులు అన్నే జార్జ్ మ్యాథ్యూ, డా. మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది.

ఆం.ప్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి ఎన్. మౌర్య, ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత లైజన్ అధికారులు తదితరులు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియ మరియు సభ్యులకు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ లతో కలిసి ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి కలంకారి క్లస్టర్ నందు తయారు చేయబడిన పెద్ద కలంకారి క్యాన్వాస్ ను అందించారు.అలాగే జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారి క్లస్టర్ వాటి ప్రాశస్త్యాన్ని జిల్లా కలెక్టర్ కమిషన్ కు వివరించారు.

అంతకు మునుపు నేటి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని 16వ ఆర్థిక కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు సుప్రభాత సేవలో సేవించుకుని దర్శించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *