Breaking News

పాలు, మాంసం, గ్రుడ్లను ఉడికించి ఆహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల మన రాష్ట్రములో అకస్మాతుగా అధిక సంఖ్యలో కోళ్ళ మరణాలకు సంబంధించిన నమూనాలను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ (జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ -NIHSAD)కు ఫలితాల కొరకు పంపించడం జరిగింది. ఆఫలితాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, తదితర ప్రాంతాలలో రెడ్ జోన్లుగా ప్రకటించి వ్యాధి నియంత్రణా చర్యలు చేపట్టడం జరిగింది. తదుపరి ఆ పరిసర ప్రాంతాలతోపాటు పల్నాడు జిల్లాలో కూడా కోళ్ళ నమూనాలను నీటి నమూనాలను మరియు పర్యావరణ నమూనాలను సేకరించి, భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ కు ఫలితాల కొరకు పంపించడం జరిగింది, ఇందుకు గాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్, భోపాల్ వారు ఏప్రిల్ – 2025లో విడుదల చేసిన ప్రయోగశాల ఫలితాల ప్రకారం, సేకరించిన నమూనాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కనిపించలేదని శాస్త్రీయంగా నిర్ధారించడం జరిగినదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖామాత్యులు, కింజరాపు అచ్చెంనాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున రాష్ట్రంలోని ప్రజలందరూ, నిర్భయంగా పశూత్పత్తులైన పాలు, మాంసం మరియు గ్రుడ్లను ఉడికించి ఆహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *