Breaking News

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకొని అధికారులకు అందించవచ్చని తెలిపారు. నగరంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *