Breaking News

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు… : గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ లో గద్దె రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నేపథ్యంలో వినాయక దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, కేకు కటింగ్ చేసి, పేదలకు కోడి గ్రుడ్లును గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. చంద్రబాబునాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ కార్యక్రమంలో తూమాటి ప్రేమ్ నాధ్, గద్దె రమేష్, తాడిబాబు రావు, గాలి వెంకట రవికుమార్, గుత్తికొండ కృష్ణమోహన్, గుళ్ళపల్లి నారాయణ, రాజనాల పవన్, జాస్తి శ్రీను, దాడి సుబ్బారావు, గుంజి ఏసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *