Breaking News

ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్.,
-అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నాం. అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *